నిమ్మకాయలను తినడం, వాటి జ్యూస్ ను తాగడం చేస్తే మనకు విటమిన్ సి ఎక్కువగా అందుతుంది. విటమిన్ సి వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిత్యం మనం 90 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి తీసుకోవచ్చు. విటమిన్ సి లోపం ఉన్నవారు అయితే గరిష్టంగా 2000 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి తీసుకోవచ్చు. అంతకు మించితే దంతాలపై ఉండే ఎనామిల్ క్షీణిస్తుంది. అలాగే విరేచనాలు వస్తాయి. ఇతర అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
ఒక సాధారణ నిమ్మకాయ ద్వారా మనకు దాదాపుగా 30 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి లభిస్తుంది. అంటే రోజుకు 3 నిమ్మకాలను తినొచ్చు. అంతకు మించకూడదు. అదే విటమిన్ సి లోపం ఉన్నవారు 66 వరకు నిమ్మకాయలను తినొచ్చు. కానీ ఎవరైనా అన్ని నిమ్మకాయలను తినలేరు. కనుక సగటున ఒక వ్యక్తి రోజుకు 3 నిమ్మకాయలను తినడం ఆరోగ్యకరం. విటమిన్ సి లోపం ఉంటే కేవలం నిమ్మకాయలు మాత్రమే కాకుండా ఇతర విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి