జామ కాయలు లేదా పండ్లు ఏవైనా సరే చాలా మంది ఇష్టంగా తింటారు. వీటి రుచి పుల్లగా, తియ్యగా ఉంటుంది. కొందరు దోర జామకాయలను తింటారు. జామ కాయను శాస్త్రీయంగా సైడియం గుజావా అని పిలుస్తారు. తీపి, పులుపు, వగరు కలిసిన రుచి ఉంటుంది. జామకాయ లేదా పండును తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
డయాబెటిస్, గుండె రోగులు పోషకాలతో నిండిన ఈ పండ్లను ఆస్వాదించవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో దొరికే పండు. ప్రతి పేదవాడు కుడా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
వీటిలో విటమిన్ సి ఉంటుంది. ఇది యవ్వన, ప్రకాశవంతమైన చర్మానికి ఉపయోగపడుతుంది.
వీటిలోని పొటాషియం ఉప్పు ప్రతికూల ప్రభావాలను సమతుల్యం చేయడం ద్వారా రక్తపోటును తగ్గించటానికి సహాయపడుతుంది.
అధిక ఫైబర్ ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. జీవక్రియ చర్యను పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి మరింత సహాయపడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి