కేంద్ర ప్రభుత్వం గతంలో అమలులోకి తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత కొద్ది నెలలుగా రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో వేలాది ట్రాక్టర్లతో రైతులు మంగళవారం ర్యాలీ చేపట్టారు. కానీ ఆ ర్యాలీ హింసాత్మకంగా మారింది. పలు చోట్ల పోలీసులతోపాటు రైతులు గాయాలకు గురయ్యారు.
26, జనవరి 2021, మంగళవారం
19, జనవరి 2021, మంగళవారం
కరోనా టీకా.. 580 మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి.. కేంద్రం వెల్లడి..
దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జనవరి 16వ తేదీన ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు మొత్తం 3.80 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. కాగా టీకా తీసుకున్న వారిలో 580 మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని కేంద్రం వెల్లడించింది. వారిలో కేవలం 7 మందిని మాత్రమే చికిత్స నిమిత్తం హాస్పిటల్‌లో చేర్చారని తెలియజేసింది. కాగా టీకా తీసుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు చనిపోయారని, అయితే వారి మరణానికి టీకా కారణం కాదని కేంద్రం తెలిపింది.
శుభవార్త.. భారత్‌లో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు
కరోనా లాక్‌డౌన్ ఉన్న సమయంలో నిత్యం కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ లాక్‌డౌన్ ను ఎత్తేశాక, ఆంక్షలను నెమ్మదిగా సడలిస్తున్న తరుణంలో భారీగా కేసులు నమోదయ్యాయి. నిత్యం 1 లక్ష వరకు కేసులు నమోదు అవుతూ వచ్చాయి. అయితే గత కొద్ది కాలంగా నిత్యం నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రజల్లో కరోనా పట్ల ఇమ్యూనిటీ వచ్చిందా, ఇంకో కారణం ఏమైనా ఉందా.. అన్న విషయం తెలియదు. కానీ ప్రస్తుతం మాత్రం నిత్యం నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది.
వూహాన్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులకు కీలక ఆధారాలు లభ్యం
కరోనా మూలాలను తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ప్రస్తుతం చైనాలోని వూహాన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 14 మంది...
-
Acharya Movie Acharya Movie is an upcoming movie filming in Telugu language. This epic historical action film is being directed by famous d...