ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేది లేదని ఇప్పటి వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అందులో భాగంగానే నిన్న మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం సై అంటే సై అన్నారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది కనుక ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి వేరే మార్గం లేకుండా పోయింది. తప్పనిసరిగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సి వస్తోంది. అయితే ఇక ఎటూ ఎన్నికలను నిర్వహించడం తప్పడం లేదు కనుక.. ఏపీ ప్రభుత్వం ఏకగ్రీవాల పేరిట ప్రోత్సాహకాలను అందజేస్తామని ప్రకటించింది.
26, జనవరి 2021, మంగళవారం
గవర్నర్ బిశ్వభూషణ్ తో భేటీ కానున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయిన విషయం విదితమే. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం గవర్నర్‌తో భేటీ కానున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో నిమ్మగడ్డ సమావేశం అవుతారు. ఎన్నికల ఏర్పాట్లు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన గవర్నర్‌కు వివరిస్తారు.
ఏపీ ప్రభుత్వ కొత్త జీవోపై స్పష్టత ఇచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పంచాయతీలు అన్నీ ఏకగ్రీవం అయితే గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఉంటుందన్నారు. సీఎం జగన్ జీవో 36/2020ని ఇచ్చారన్నారు.
మదనపల్లి హత్యల కేసు.. డెల్యూషన్స్ అనే వ్యాధితోనే దారుణానికి పాల్పడ్డ పురుషోత్తం, పద్మజ..
చిత్తూరులోని మదనపల్లిలో తమ కుమార్తెలను హత్య చేసిన కేసులో తల్లిదండ్రులు పురుషోత్తం, పద్మజలకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. దీంతో నిందితులను మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. తమ ఇద్దరు కుమార్తెలను వారు క్షుద్ర పూజల పేరిట బలితీసుకున్నారు. అయితే జైలుకు తరలించే ముందు వారిద్దరికీ మానసిక వైద్య పరీక్షలు చేయించగా షాకింగ్ విషయం బయట పడింది.
వూహాన్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులకు కీలక ఆధారాలు లభ్యం
కరోనా మూలాలను తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ప్రస్తుతం చైనాలోని వూహాన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 14 మంది...
-
Acharya Movie Acharya Movie is an upcoming movie filming in Telugu language. This epic historical action film is being directed by famous d...