కరోనా మూలాలను తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ప్రస్తుతం చైనాలోని వూహాన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 14 మంది నిపుణులు అక్కడ పర్యటిస్తున్నారు. వీరి పర్యటన ఫిబ్రవరి 10వ తేదీన ముగియనుంది. అయితే వూహాన్‌లో పర్యటించిన వారికి కరోనా వైరస్‌కు సంబంధించిన పలు కీలక ఆధారాలు లభ్యం అయినట్లు తెలిసింది.
వూహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌లోనూ సదరు నిపుణుల బృందం పర్యటించింది. ఈ క్రమంలోనే ఆ బృందంలో ఒకరైన పీటర్ డెన్‌జాక్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తికి గాను వూహాన్ సీఫుడ్ మార్కెట్‌లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఫిబ్రవరి 10న తమ పర్యటన ముగుస్తుందని, అప్పటి వరకు తమ పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
ఇక వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైంటిస్టులతో కూడా ఆ నిపుణులు సమావేశమయ్యారు. వూహాన్‌లో అసలు ఏం జరిగింది ? అనే విషయాలను పూర్తిగా తెలుసుకోవడం వల్ల ప్రపంచంలో ఇలాంటి మహమ్మారులు మళ్లీ రాకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి