బ్రిస్బేన్‌లోని ది గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన నాలుగో టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. ఆస్ట్రేలియాపై 3 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో గెలుపొందింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 115.2 ఓవర్లలో 369 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో111.4 ఓవర్లలో 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తరువాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 97 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి