సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పంచాయతీలు అన్నీ ఏకగ్రీవం అయితే గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఉంటుందన్నారు. సీఎం జగన్ జీవో 36/2020ని ఇచ్చారన్నారు.
గతంలో పంచాస్ అని ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేసే వారని, కానీ ప్రస్తుతం గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశామన్నారు. గుజరాత్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలలో చాలా వరకు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయన్నారు. రాజకీయాలకు అతీతంగా పంచాయతీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు ఇన్సెంటివ్స్ ఇస్తారని అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి