ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేది లేదని ఇప్పటి వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అందులో భాగంగానే నిన్న మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం సై అంటే సై అన్నారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది కనుక ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి వేరే మార్గం లేకుండా పోయింది. తప్పనిసరిగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సి వస్తోంది. అయితే ఇక ఎటూ ఎన్నికలను నిర్వహించడం తప్పడం లేదు కనుక.. ఏపీ ప్రభుత్వం ఏకగ్రీవాల పేరిట ప్రోత్సాహకాలను అందజేస్తామని ప్రకటించింది.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు నడుం బిగించినట్లు స్పష్టమవుతుంది. అందుకు కారణం ఆ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోయే కారణం. దాని ప్రకారం ఏకగ్రీవం అయిన పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేస్తుంది. మొత్తం 4 విభాగాలుగా ప్రోత్సాహకాలను అందజేయనున్నారు.
* 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలో ఎన్నిక ఏకగ్రీవం అయితే రూ.5 లక్షలను ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందజేస్తుంది.
* 2వేల నుంచి 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలో ఎన్నిక ఏకగ్రీవం అయితే రూ.10 లక్షలను ఇస్తారు.
* 5వేల నుంచి 10వేల జనాభా ఉన్న పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవం అయితే రూ.15 లక్షలను ప్రభుత్వం అందజేస్తుంది.
* 10వేలకు పైన జనాభా కలిగి ఉండే పంచాయతీలో ఎన్నిక ఏకగ్రీవం అయితే రూ.20 లక్షలను ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందజేస్తుంది.
అయితే ఎన్నికలను ఎటూ నిర్వహించక తప్పడం లేదు కనుక వీలున్నన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకే ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఆ జీవోను విడుదల చేసి ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రకటించినట్లు స్పష్టమవుతుంది. అయితే పంచాయతీ ఎన్నికలు జరిగేందుకు ముందుగానే.. అంటే నామినేషన్ల ఉప సంహరణ ముగిశాకే ఈ విషయం స్పష్టమవుతుంది కనుక.. అప్పటి వరకు ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవం అవుతాయో, ఎన్నింటికి ఎన్నికలు జరుగుతాయో.. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఏమంటారో.. చూడాలి.
ఏపీలో మొత్తం 4 దశల్లో, ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి