ఏపీలో పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయిన విషయం విదితమే. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం గవర్నర్‌తో భేటీ కానున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో నిమ్మగడ్డ సమావేశం అవుతారు. ఎన్నికల ఏర్పాట్లు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన గవర్నర్‌కు వివరిస్తారు.
కొత్త షెడ్యూల్ ప్రకారం ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 9 నుంచి జరుగుతాయి. ఆ తేదీన తొలి దశలో ఎన్నికలను నిర్వహిస్తారు. అనంతరం 13న రెండో దశ, 17న 3వ దశ, 21న 4వ దశ ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలో తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి