19, జనవరి 2021, మంగళవారం

శుభ‌వార్త‌.. భార‌త్‌లో భారీగా త‌గ్గుతున్న క‌రోనా కేసులు

క‌రోనా లాక్‌డౌన్ ఉన్న స‌మ‌యంలో నిత్యం కేసుల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండేది. కానీ లాక్‌డౌన్ ను ఎత్తేశాక‌, ఆంక్ష‌ల‌ను నెమ్మ‌దిగా స‌డ‌లిస్తున్న త‌రుణంలో భారీగా కేసులు న‌మోద‌య్యాయి. నిత్యం 1 ల‌క్ష వ‌ర‌కు కేసులు న‌మోదు అవుతూ వ‌చ్చాయి. అయితే గ‌త కొద్ది కాలంగా నిత్యం న‌మోదు అవుతున్న క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. ప్ర‌జ‌ల్లో క‌రోనా ప‌ట్ల ఇమ్యూనిటీ వ‌చ్చిందా, ఇంకో కార‌ణం ఏమైనా ఉందా.. అన్న విష‌యం తెలియ‌దు. కానీ ప్ర‌స్తుతం మాత్రం నిత్యం న‌మోదు అవుతున్న క‌రోనా కేసుల సంఖ్య‌లో భారీగా త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. 

భార‌త్‌లో భారీగా త‌గ్గుతున్న క‌రోనా కేసులు

మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు అందిన స‌మాచారం ప్రకారం భార‌త్‌లో కొత్త‌గా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 7,09,791 క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా అందులో 10,064 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో మొత్తం కేసుల సంఖ్య 1,05,81,837కు చేరుకుంది. సోమ‌వారం క‌రోనా నుంచి 17,411 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 1,02,28,753కు చేరుకుంది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం 2,00,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

గ‌త 24 గంట‌ల్లో క‌రోనాతో 137 మంది చ‌నిపోయారు. మొత్తం 1,52,556 మంది క‌రోనా వ‌ల్ల మృతి చెందారు. మ‌ర‌ణాల రేటు 1.44 శాతంగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్ర‌మం య‌థావిధిగా కొన‌సాగుతోంది. సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 3,81,305 మందికి కోవిడ్ టీకా అందింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియ‌జేసింది. సోమ‌వారం ఒక్క రోజే 25 రాష్ట్రాల్లో 1,48,266 మందికి టీకా వేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వూహాన్‌లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణుల‌కు కీల‌క ఆధారాలు ల‌భ్యం

క‌రోనా మూలాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ప్ర‌స్తుతం చైనాలోని వూహాన్ లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 14 మంది...