కేంద్ర ప్రభుత్వం గతంలో అమలులోకి తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత కొద్ది నెలలుగా రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో వేలాది ట్రాక్టర్లతో రైతులు మంగళవారం ర్యాలీ చేపట్టారు. కానీ ఆ ర్యాలీ హింసాత్మకంగా మారింది. పలు చోట్ల పోలీసులతోపాటు రైతులు గాయాలకు గురయ్యారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన రైతుల ర్యాలీలో మొత్తం 83 మంది వరకు పోలీసులు గాయపడినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తూర్పు ఢిల్లీలో 34 మంది, ఎర్ర కోట వద్ద 41 మంది గాయాలకు గురయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ రైతులు శాంతియుతంగా ఇతర మార్గాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లాలని సూచించారు. కాగా ట్రాక్టర్ ర్యాలీలో ఓ రైతు కూడా మృతి చెందాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి