26, జనవరి 2021, మంగళవారం

బాలుకు ప‌ద్మ‌విభూష‌ణ్ ఇవ్వ‌డంపై చిరంజీవి, ప‌వ‌న్ కల్యాణ్ ఏమ‌న్నారంటే..?

కేంద్రప్రభుత్వం  2021 సంవత్సరానికి గాను  పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ విభాగాల్లో 119 మందికి అవార్డులు లభించాయి. ఏడుమందికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్ అవార్డులు దక్కగా, 102 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి పద్మశ్రీ లభించింది. 

బాలుకు ప‌ద్మ‌విభూష‌ణ్ ఇవ్వ‌డంపై చిరంజీవి, ప‌వ‌న్ కల్యాణ్ ఏమ‌న్నారంటే..?

 దివంగత గాయ‌కుడు ఎస్పీ బాల సుబ్రమణ్యంకు పద్మ విభూషణ్ ల‌భించింది. ప్రముఖ గాయని కేఎస్‌ చిత్రకు పద్మ భూషణ్ ల‌భించింది. కాగా ఎస్పీ బాలు సహా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారం ద‌క్కింది. అయితే  బాలుకు పద్మవిభూషణ్ ఇవ్వడంపై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. తన ప్రియమైన సోదరుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్‌ అవార్డు రావడం  ఆనందంగా ఉందని అన్నారు. ఆయ‌న ఆ అవార్డుకు ఆయన అర్హుల‌ని అన్నారు. అయితే బాలుకు మ‌ర‌ణానంత‌రం ప‌ద్మ‌విభూష‌ణ్ రావ‌డం బాధ క‌లిగిస్తుంద‌న్నారు. 

ఇక ఇదే విష‌యంపై  జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. బాలుకు పద్మవిభూషణ్ ఇవ్వడం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక‌ ప్రకటన విడుదల చేశారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వూహాన్‌లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణుల‌కు కీల‌క ఆధారాలు ల‌భ్యం

క‌రోనా మూలాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ప్ర‌స్తుతం చైనాలోని వూహాన్ లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 14 మంది...